![]() |

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. అందులో శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇందులో గుండె నిండా గుడి గంటలు వెర్సెస్ పొదరిల్లు సీరియల్స్ మధ్య పోటీ నడుస్తోంది. ఐతే ఈ సీరియల్స్ హీరో హీరోయిన్స్ కి ఒక టెస్ట్ పెట్టింది. ముందుగా గుండె నిండా గుడి గంటలు టీమ్ లో బాలు - అమూల్య మధ్య ఈ పోటీ పెట్టింది. ఒక బోర్డు మీద హీరో హీరోయిన్స్ కి సంబంధించిన కొన్ని క్వాలిటీస్ రాసి వాటికి మార్క్స్ వేయించింది.
"అమూల్య పిసినారితనం " అని శ్రీముఖి అడిగింది. జీరో అని రాసాడు బాలు. "ఎందుకంటే నెలలో ఎప్పుడైనా సరే టెక్నిషియన్స్ కి ఆర్టిస్టులకు స్వీట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ తెప్పిస్తుంది. అలగడం అన్న క్వాలిటీకి 3 మార్కులు వేసాడు శ్రీముఖి దానికి ఇంకో 7 మార్కులు యాడ్ చేసింది. "న్యాయం కోసం అలుగుతా " అంటూ చెప్పింది అమూల్య. ఇక అసూయ అనే క్వాలిటీకి జీరో బద్ధకం అనే క్వాలిటీకి 1 మార్కు వేసాడు. తర్వాత బాలు క్వాలిటీస్ కి అమూల్యతో మార్కులు వేయించింది శ్రీముఖి.
పొగరెంతుంది మా బాలులో అని అడిగింది. పిసినారితనానికి 3 , పొగరు జీరో, బద్ధకం జీరో . మా ఆయనకు పొగరు లేదు. ఆయన మంచాయన అని చెప్పింది అమూల్య . "ఎప్పుడైనా సెట్ లోకి లేట్ గా వచ్చిన తర్వాత ఎందుకింత లేట్ నేను వెయిట్ చేస్తున్నా " అన్నావా అని శ్రీముఖి అడిగింది. "నిజానికి మా ఇద్దరి మధ్య ఒక అండర్ స్టాండింగ్ ఉంది. ఆయన వచ్చినప్పుడు నేను లేట్ చేయకూడదని నేను వచ్చేస్తా నేను వచ్చినప్పుడు ఆయన వచ్చేస్తారు" అని చెప్పింది. "యా ఆ అండర్ స్టాండింగ్ అవసరం లేదు కానీ ఉంది " అంటూ శ్రీముఖి కూలిపోయింది.
తర్వాత పొదరిల్లు సీరియల్ కృతికకు పొగరు అనే క్వాలిటీకి 3 మార్కులు వేసాడు దీపక్. దానికి రీజన్ చెప్పండి అంటూ నిలదీసింది కృతిక. లేకపోతే ఈ సెట్ లో నిజంగా చూపిస్తా. ఇంతలో శ్రీముఖి ఏయ్ ఏంటి నువ్వెంటి ఆయనని బెదిరిస్తున్నావ్ అంది. తర్వాత ఈ రెండు సీరియల్స్ కి సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో అన్న విషయాన్నీ కొన్ని రీల్స్ ప్లే చేసి చూపించింది శ్రీముఖి.
-------------
![]() |